స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి సోమవారం మృగశిర నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశమున తేది 19-02-2024 ఉదయం 10-39 నిమిషములకు గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, పేరేచర్ల గ్రామంలో శ్రీ మహా త్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి వారి అనుజ్ఞ గణపతి దేవస్థాన నూతన ఆలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడినది.
మంగళ వాద్యములతో ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, స్వస్తివాచనములు.
మృగశిర నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశమున శంకుస్థాపన రత్న్యాస ప్రతిష్ట.
శైవాగమ పండిత ఆశీర్వచనములు మరియు భక్తులకు మహా ప్రసాద వితరణ.
"కావున భక్తజనులందరూ ఈ దివ్య శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొని, స్వామివార్ల కృపాకటాక్ష వీక్షణములు పొంది తరించవలసిందిగా కోరడమైనది."