శ్రీరస్తు • శుభమస్తు • దివ్య ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వానము - మార్చి 2026

శ్రీ మహా త్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి వారి ఆలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక

మార్చి 2026 నూతన దివ్య ఆలయ ప్రారంభోత్సవము, ప్రాణప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రిక - పేరేచర్ల గ్రామం, గుంటూరు జిల్లా.

🕉 శ్రీరస్తు • శుభమస్తు 🕉
కాంచీ శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో మరియు పీఠాధిపతుల కరకమలములచే

శ్రీ మహా త్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి
వారి అనుజ్ఞ గణపతి దేవస్థానము

📍 పేరేచర్ల గ్రామం, మేడికొండూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
🛕 నూతన శ్రీ దేవస్థాన ప్రారంభోత్సవ & మహాకుంభాభిషేక ఆహ్వాన పత్రిక
భక్త మహాశయులారా !

పరమశివుని దివ్యానుగ్రహం మరియు పూజ్య పీఠాధిపతుల ఆశీస్సులతో గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామంలో నిర్మితమైన నూతన శ్రీ మహా త్రిపుర సుందరీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థాన దివ్య మందిరం శిల్పశాస్త్ర బద్ధంగా పూర్తికావచ్చినది. మార్చి 2026న జరగబోవు నూతన ఆలయ ప్రారంభోత్సవము, శ్రీ మరకత లింగ ప్రాణప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేక వైభవ మహోత్సవములకు భక్తమహాశయులందరూ కుటుంబసమేతంగా విచ్చేసి స్వామివారి దివ్యాశీస్సులు పొందగోరుచున్నాము.

📅 ఆలయ ప్రారంభోత్సవ దివ్య పూజా కార్యక్రమముల పట్టిక (మార్చి 2026)

మార్చి మొదటి రోజు • ఉదయం 7-00 ని||లకు
యాగశాల ప్రవేశం & గణపతి హోమము

అనుజ్ఞ పూజలు, యాగశాల ప్రవేశము, మహా గణపతి హోమము, పుణ్యాహవాచనం, చతుర్వేద పారాయణములు మరియు అఖండ దీపారాధన.

మధ్యాహ్నం 12-30 ని॥ల నుండి
మహా పూర్ణాహుతి & బృహత్ అన్నదానము

మహా పూర్ణాహుతి, శైవాగమ పండిత సత్కారము, తీర్థప్రసాద వితరణ మరియు వేలాదిమంది భక్తులకు బృహత్ అన్నసంతర్పణ.

శైవాగమ పండిత రత్న • ఆలయ ప్రధాన శైవాగమ ఆచార్యులు
బ్రహ్మశ్రీ మామిళ్ళపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య

"ఈ దివ్య ఆలయ ప్రారంభోత్సవ మహోత్సవంలో పాల్గొని స్వామివారి దివ్య కృపాకటాక్షములు పొందవలసిందిగా కోరుచున్నాము."

Om Namah Shivaya Tap to play